Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, July 25, 2013

కొలొస్సయులకు4వఅధ్యాయము

1  యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని యెరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులయెడల చేయుడి. 
 2-4. ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెళుకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మముగూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెననిమాకొరకు ప్రార్థించుడి. 
5  సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, (సంఘమునకు) వెలపటివారియెడల జ్ఞానముకలిగి నడుచుకొనుడి. 
6  ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి. 
7  ప్రియసహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును, నా జతసేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నియు మీకు తెలియజేయును. 
  8-9. మీరు మా స్థితి తెలిసికొనునట్లును మీ హృదయములను అతడు ఆదరించునట్లును అతనిని అతనితో కూడ నమ్మకమైన ప్రియసహోదరుడైన ఒనేసిమును మీయొద్దకు పంపుచున్నాను; అతడు మీయొద్దనుండి వచ్చినవాడే; వీరిక్కడి సంగతులన్నియు మీకు తెలియజేతురు. 
10  నాతోకూడ చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీపజ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు; ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి. 
11  మరియు యూస్తు అను యేసుకూడ మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందినవారిలో చేరినవారు, వీరుమాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జతపనివారై యున్నారు, వారివలన నాకు ఆదరణ కలిగెను. 
12  మీలో ఒకడును క్రీస్తుయేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు; మీరు సంపూర్ణులును, ప్రతివిషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండవలెనని యితడెల్లప్పుడును మీకొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. 
13  ఇతడు మీకొరకును, లవొదికైయవారికొరకును, హియెరపొలివారికొరకును బహు ప్రయాసపడుచున్నాడని యితనిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. 
14  లూకా అను ప్రియుడైన వైద్యుడును, దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. 
15  లవొదికైయలో ఉన్న సహోదరులకును సుంఫాకును, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. 
16  ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికైయ వారి సంఘములోను చదివించుడి; లవొదికైయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి. 
17  మరియు - ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్తపడుమని అర్ఖిప్పుతో చెప్పుడి. 
18  పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయుచున్నాను; నా బంధకములను జ్ఞాపకము చేసికొనుడి. కృప మీకు తోడైయుండును గాక. 

        Download Audio File

No comments:

Post a Comment