Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, July 25, 2013

కొలొస్సయులకు2వఅధ్యాయము

 1-2. మీరును, లవొదికైయవారును, శరీరరీతిగా నాముఖము చూడకున్నవారందరును ప్రేమయుందు అతుడబడి, గ్రహించుచున్నామను సంపూర్ణ భాగ్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును స్పష్టముగా తెలిసికొన్నవారై, మీ హృదయములు ఆదరణపొందవలెనని మీ అందరికొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొన గోరుచున్నాను. 
3  బుద్ధి విజ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి. 
4  ఎవడైనను చక్కనిమాటలచేత మిమ్మును మోసపరచుకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. 
5  నేను శరీరవిషయములో దూరముగా ఉన్నను ఆత్మ విషయములో మీతోకూడ ఉండి మీ యోగ్యమైన ప్రవర్తననుక్రీస్తనందలి మీ స్థిరవిశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. 
6-8. కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, (యింటివలె) కట్టబడుచు, మీరు నేర్చుకొనినప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరములైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపచుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. 
9  ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు నివసించుచున్నది; 
10  మరియు ఆయనయందు మీరును సంపూర్ణులైయున్నారు; ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సైయున్నాడు; 
  11-12. మీరును బాప్తిస్మమందు ఆయనతోకూడ పాతి పెట్టబడినవారై ఆయనయందు సున్నతి పొందితిరి; ఆ సున్నతి చేతులతో చేయబడునది కాదుగాని శరీరేచ్ఛాయుక్తమైన స్వభావమును విసర్జించుటయను క్రీస్తుకు (అనుకూలమైన) సున్నతియే. ఆయనను మృతులలోనుండి లేపిన దేవుడు కనుపరచిన ప్రభావమందు విశ్వాసముంచుటచేత ఆ బాప్తిస్మమువలన ఆయనతో కూడ లేచితిరి. 
  13-15. మరియు అపరాధములవలనను, శరీరమందు సున్నతిపొందకయుండుటవలనను, మీరు మృతులైయుండగా దేవుడు విధిరూపకమైన ఆజ్ఞలవలన మనమీద రుణముగాను మనకు విరోధముగానుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తివేసి, మన అపరాధములనన్నిటిని క్షమించి ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను; ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా (వేడుకకు) కనుపరచెను. 
16  కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. 
17  ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజస్వరూపముక్రీస్తులో ఉన్నది. 
  18-19. అతి వినయాసక్తుడై దేవదూతారాధనయందు ఇచ్ఛకలిగి, తాను చూచిన వాటినిగూర్చిగొప్పగా చెప్పుకొనుచు, తన శరీరసంబంధమైన మనస్సువలన ఊరికె ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొననివాడెవడును మీ బహూమానమును అపహరింపనియ్యకుడి; ఆ శిరస్సుమూలముగా సర్వశరీరము కీళ్లచేతను నరములచేతను పోషింపబడి అతుకబడినదై దేవునివలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. 
  20-22. మీరు క్రీస్తుతోకూడ లోకముయొక్క మూలపాఠముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి - చేత పట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేల? అవన్నియు వాడుకొనుటచేత నశించిపోవును. 
23  అట్టివి స్వేచ్చారాధన విషయములోను జ్ఞానరూపకమైనవని యెంచబడుచున్నవేగాని, శరీరేచ్ఛానిగ్రహవిషయములో ఏమాత్రమును ఎన్నికచేయదగినవి కావు. 
       Download Audio File

No comments:

Post a Comment