Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, July 25, 2013

కొలొస్సయులకు3వఅధ్యాయము

1  మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. 
  2-3. పైనున్నవాటిమీదనే గాని భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి; ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది. 
4  మనకు జీవమైయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. 
5  కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షనుచంపివేయుడి. 
6  వాటివలన దేవుని ఉగ్రత అవిధేయులమీదికివచ్చును. 
7  పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకొంటిరి. 
8  ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. 
  9-10. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి; ఏలయనగా ప్రాచీనస్వభావమునుదాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి జ్ఞానము కలుగునిమిత్తము దాని సృష్టించినవాని పోలికెచొప్పున నూతనపరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొనియున్నారు. 
11  ఇట్టివారిలో హెల్లేనీయుడని యూదుడని భేదములేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదములేదు; పరదేశియని స్కూథాయుడనిదాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నావాడునై యున్నాడు. 
12  కాగా దేవుని చేత ఏర్పరచబడినవారును పరిశుద్ధలును ప్రియులునైనవారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. 
13  ఎవడైనను తనకు హాని చేసెనని యొకడనుకొనినయెడల ఒకని ఒకడు సహించుచు ఒకని ఒకడు క్షమించుడి, ప్రభువుమిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. 
14  వీటిన్నిటిపైని పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి 
15  క్రీస్తు (అనుగ్రహించు) సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి. 
16  సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధిచెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానముచేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి. 
17  మరియు మాటచేత గాని క్రియచేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయనపేరట చేయుడి. 
18  భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది. 
19  భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి. 
20  పిల్లలారా, అన్నివిషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనదగినది. 
21  తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. 
22  దాసులారా, మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు కంటిక కనబడవలెననికాక, ప్రభువుకు భయపడుచు శుద్ధాంతఃకరణగలవారై, శరీరమునుబట్టి మీ యజమానులైనవారికి అన్నివిషయములలో విధేయులై యుండుడి. 
  23-24. ప్రభువువలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురుగనుక మీరేమిచేసినను అది మనుష్యుల నిమిత్తముకాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి; మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై యన్నారు. 
25  అన్యాయము చేసినవానికి తాను చేసిన అన్యాయము కొలది మరల లభించును, పక్షపాతముండదు. 
         Download Audio File

No comments:

Post a Comment